Karimnagar: సమాజ హితం కోరే జంటలకు ఆదర్శం.. కరీంనగర్‌లో ఆదర్శ వివాహం

Karimnagar: కరీంనగర్‌లో ఏఐఎస్ఎఫ్ నాయకులు కండె విజేత, రేణుకుంట్ల ప్రీతమ్ ల ఆదర్శ వివాహం వైభవంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 6:31 PM IST
Karimnagar
X

Karimnagar: సమాజ హితం కోరే జంటలకు ఆదర్శం.. కరీంనగర్‌లో ఆదర్శ వివాహం

కరీంనగర్: జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందించదగ్గ విషయమని, ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి నూతన దంపతులకు సూచించారు.

శనివారం కరీంనగర్ నగరంలోని పద్మ నగర్ ఇందిరా గార్డెన్ లో సిపిఐ కరీంనగర్ జిల్లా సహకారంతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో -కన్వీనర్ కండె విజేత,పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ ఆదర్శ వివాహం శ్రీనివాస్ రెడ్డి,చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో జరిగింది.

అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి,అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని నూతన దంపతులుగా ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి,వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవ సమాజంలో మగవారికి ఆడవారి తోడు,ఆడవారికి మగవారి తోడు ఎంతో అవసరమని, కష్ట,సుఖాల్లో పాలుపంచుకోవడానికి ఒకరికి ఒకరు అండగా ఉండడం కోసం వివాహ బంధంతో ఒకటికావడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ప్రపంచంలో వివిధ మతాలు,

సాంప్రదాయాల కనుగుణంగా వివాహాలు జరగడం పరిపాటి కానీ వివాహానికి ముందే అన్ని విధాలుగా ఒకరినొకరు పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగడానికి నిర్ణయించుకున్న తర్వాతనే నేటి సమాజంలో వివాహాలు చేసుకుంటున్నారని ఇది శుభ పరిణామమని,విద్యార్థి సంఘ నేతలుగా ఉన్న నాడే సురవరం సుధాకర్ రెడ్డి - విజయలక్ష్మి లాంటి వారితో పాటు అనేకమంది అభ్యుదయ వాదులు ఆదర్శ వివాహాలు చేసుకున్నారని వారు గుర్తు చేశారు.

విజేత,ప్రేతమ్ లు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పూర్తిస్థాయిలో పనిచేస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు, సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తూనే,వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని,ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టసుఖాల్లో తోడుగా ఉండి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ నూతన జంటకు మా ఆశీస్సులు,శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి,వెంకటరెడ్డి తెలిపారు.

వివాహ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్,పెద్దపల్లి,సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్,తాండ్ర సదానందం,మంద సుదర్శన్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,గోషిక మోహన్,గౌతం గోవర్ధన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,ఏఐఎస్ఎఫ్

మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ సృజన్ కుమార్,రామగుండం కార్పొరేటర్ మార్కాపురి సూర్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రామారపు వెంకటేష్,మచ్చ రమేష్ తో పాటు సిపిఐ మరియు ఏఐఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story