Karimnagar: పరీక్షా కేంద్రాల్లో అడిషనల్ కలెక్టర్ తనిఖీ

Karimnagar: కరీంనగర్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 4:55 PM IST
Karimnagar
X

Karimnagar: పరీక్షా కేంద్రాల్లో అడిషనల్ కలెక్టర్ తనిఖీ

కరీంనగర్: నగరంలో గల పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. తిరుమల్ నగర్ లోని తెలంగాణ మైనారిటీ బాలికల స్కూలు 2 , కోతి రాంపూర్ లోని (సవరన్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విద్యార్థుల హాజరు అంశాలపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story