Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా జాతీయ లోక్ అదాలత్!

Narsapur: నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. రాజీయే రాజమార్గమని, రాజీపడిన కేసుల తీర్పు అంతిమమని జడ్జి ఎం. హేమలత వెల్లడి.

G Ashok Reddy, Narsapur
Published on: 13 Sept 2026 6:36 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా జాతీయ లోక్ అదాలత్!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవా సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు రాజీ చేయదగిన కేసులను పరిష్కరించారు.

రాజీతో సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత మాట్లాడుతూ.. “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు. రాజీ చేయదగిన కేసుల్లో ఇరువర్గాలు పరస్పర సహకారంతో ముందుకు వచ్చి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారం అనంతరం ఇరుపక్షాలు స్నేహపూర్వకంగా, కలిసిమెలిసి జీవించాలని ఆమె ఆకాంక్షించారు.

లోక్ అదాలత్ తీర్పు అంతిమం

లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించే కేసుల్లో వెలువడే అవార్డు/తీర్పు అంతిమంగా పరిగణించబడుతుందని జడ్జి హేమలత తెలిపారు. కోర్టుల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న రాజీ చేయదగిన వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

న్యాయ, పోలీసు అధికారులు.. న్యాయవాదుల హాజరు

కార్యక్రమంలో నర్సాపూర్ కోర్టు ఏజీపీ డి. శ్రీధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ గౌడ్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ శాస్త్రుల మధుశ్రీశర్మ, లీగల్ సర్వీసెస్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్, కౌడిపల్లి ఎస్‌ఐ అమరేందర్ రెడ్డి, చిలప్‌చెడ్ ఎస్‌ఐ నర్సింహులు, ఎక్సైజ్ ఎస్‌ఐ, సీనియర్ న్యాయవాదులు ఆర్. శ్రీనివాస్ రెడ్డి, ఈ. సత్యనారాయణ, సి.హెచ్. స్వరూపరాణి, పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే న్యాయవాదులు నాగరాజు, జాట్రోత్ రవినాయక్, ఏ. సాయిరాం, బి. మానయ్య, నీలవేణి, కోర్టు సూపరింటెండెంట్ ఎం.ఎల్. సూర్యప్రకాశ్, లీగల్ సర్వీసెస్ టైపిస్ట్ కం అసిస్టెంట్ కే. సుభాష్, కోర్టు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్ హరిబాబు గౌడ్, దిలీప్ గౌడ్, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు హాజరయ్యారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు కేసులను పరిష్కరించడంతో కక్షిదారులకు సత్వర న్యాయం అందినట్లయింది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur