Jayalalithaa House Seized: హైదరాబాద్‌లో జయలలిత నివాసం సీజ్.. కారణం అదే!

Jayalalithaa House Seized: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు.

Arun Chilukuri
Published on: 31 March 2026 12:07 PM IST
Jayalalithaa House Seized
X

Jayalalithaa House Seized: హైదరాబాద్‌లో జయలలిత నివాసం సీజ్.. కారణం అదే!

Jayalalithaa House Seized: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆమె ఇంటిపై భారీగా పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ. 83 లక్షల పన్ను బకాయిలు:

చాలా కాలంగా ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 83 లక్షల రూపాయల మేర ఇంటి పన్ను పెండింగ్‌లో ఉందని, పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఇంటిని సీజ్ చేసినట్లు సమాచారం.

అమ్మ ఆస్తులపై చర్చ:

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మరణించిన సంగతి తెలిసిందే. ఆమెను అభిమానులు ప్రేమగా 'అమ్మ', 'పురట్చి తలైవి' అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన జయలలితకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. గతంలో ఆమెపై నమోదైన 'ఆదాయానికి మించిన ఆస్తుల కేసు' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తమిళనాడు సర్కారుకు ఆస్తుల బదిలీ:

జయలలిత మరణానంతరం మరియు కేసుల విచారణల నేపథ్యంలో.. ఆమెకు చెందిన కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, నగదు, విలువైన ఆస్తుల పత్రాలను అధికారులు ఇప్పటికే మూడు ట్రంకు పెట్టెల్లో భద్రపరిచి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. అయితే, హైదరాబాద్‌లోని ఈ ఆస్తిపై పన్ను బకాయిల కారణంగా ఇప్పుడు తాజాగా సీజ్ ప్రక్రియ జరగడం చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story