Jammikunta: పదవీ విరమణ పొందిన నలుగురు ఉద్యోగులకు చైర్మన్ వీడ్కోలు

Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీలో సుదీర్ఘకాలం సేవలందించి విరమణ పొందుతున్న ఉద్యోగులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఘనంగా సన్మానించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 5:18 PM IST
Jammikunta
X

Jammikunta: పదవీ విరమణ పొందిన నలుగురు ఉద్యోగులకు చైర్మన్ వీడ్కోలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న గాజుల ఎల్లయ్య, బూడిద సారయ్య, దొడ్డే మొగిలి, గుల్లి మొగిలి గార్ల పదవీ విరమణ వీరికి శాలువాలతో సన్మానించారు.

ఈకార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ గత కొంతకాలంగా జమ్మికుంట మున్సిపల్ కి అనేక సేవలందించి పదవి విరమణ పొందుతున్న మీరు ఎప్పుడైనా మీకు గాని మీ కుటుంబ సభ్యులకి గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని,

నేను మున్సిపల్ కుటుంబానికి చెందిన వాడనని మా తాత నుండి నేటివరకు మది మున్సిపల్ కుటుంబం అని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ యండి ఆయాజ్ , వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ , కౌన్సిలర్స్ శీలం శ్రీనివాస్, పొనగంటి రాము మాచెర్ల రాజు,కోలుగురి సురేష్, కూతడి తిరుపతి, పొనగంటి విష్ణు, బత్తుల లక్ష్మణ్,దిడ్డి రాము, మంద రాజేష్, మైస రవి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story