Kukunoor: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. అధికారుల హెచ్చరిక

Kukunoor: కుక్కునూరు మండలంలోని దాచారం, ఇబ్రహీంపేట ఇసుక ర్యాంపుల నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 6:29 PM IST
Kukunoor
X

Kukunoor: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. అధికారుల హెచ్చరిక

Kukunoor: అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కుకునూరు తాసిల్దార్ రమేష్ బాబు, సిఐ రమేష్ బాబు లు హెచ్చరించారు. కుక్కునూరు మండలంలోని దాచారం, ఇబ్రహీం పేట ఇసుక ర్యాంపులను మైనింగ్ శాఖ గిరిజన సొసైటీలకు కేటాయించింది. సదరు ర్యాంపుల నుండి రాత్రులు లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక తెలంగాణకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నా రని పత్రికా మాధ్యమాలలో వస్తున్న వార్తలు పై స్పందిస్తూ కుక్కునూరు తాసిల్దార్ రమేష్ బాబు, సిఐ రమేష్ బాబు లు ఈ సందర్భంగా మాట్లాడుతూ..

కుక్కునూరు మండల పరిధిలోని దాచారం, ఇబ్రహీం పేట ఇసుక ర్యాంపుల నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చట్ట విరుద్ధమని, ఇసుక ర్యాంపులు పని వేళలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక ర్యాంపులు నిర్వహించాలని, ఇసుక ర్యాంపుల్లో ప్రోక్లైన్లతో వాహనాల్లో ఇసుక లోడ్ చేయడానికి అనుమతులు లేవని, స్థానిక గిరిజనుల అభివృద్ధి నిమిత్తం గిరిజన, గిరిజనేతరులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఇసుక ర్యాంపుల్లో మనుషులతోనే వాహనాల్లో ఇసుక లోడ్ చేయాలని,

ఇసుక ర్యాంపుల్లో లారీలు టిప్పర్లు లోడ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని మైనింగ్ శాఖ సూచించిన నిబంధన మేరకు రాంపుల నిర్వహణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై పోలీస్,రెవిన్యూ శాఖ నిఘా నిరంతరం ఉంటుందని, ఇసుక అక్రమ రవాణా పాల్పడితే ర్యాంపులు పొందిన గిరిజన సొసైటీ మరియు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story