Kamareddy: ఐస్ క్రీం బండ్లకు 'నో ఎంట్రీ'.. తెల్గపూర్ సర్పంచ్ సాహసోపేత నిర్ణయం!
Kamareddy: కామారెడ్డి జిల్లా తెల్గపూర్ గ్రామంలో ఐస్ క్రీం బండ్ల ప్రవేశంపై పూర్తి నిషేధం. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా సర్పంచ్ మేఘన నగేశ్ సంచలన నిర్ణయం.
Kamareddy: ఐస్ క్రీం బండ్లకు 'నో ఎంట్రీ'.. తెల్గపూర్ సర్పంచ్ సాహసోపేత నిర్ణయం!
తెల్గపూర్ (కామారెడ్డి): జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండలం తెల్గ పూర్ గ్రామంలో ఐస్ క్రీం బండ్ల కు గ్రామంలో ప్రవేశం లేదంటూ గ్రామ సర్పంచ్ మేఘన నగేశ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గ్రామంలో ఎ ఒక్క బండి రాకుండా ఉండేందుకు గాను నడుం బిగించారు. ప్రధానంగ గ్రామంలో ఐస్ క్రీం బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఫ్లెక్సీ రూపంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో అనధికారికంగా తిరుగుతూ ఐస్ క్రీం వ్యాపారం నిర్వహించడంవల్ల గ్రామంలో పరిశుభ్రత సమస్యలు తలెత్తడంతోపాటు చిన్నారుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ శ్రేయస్సు దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. చిన్నారులు ఐస్ క్రీమ్ లు తినడంవల్ల ఐస్ క్రీం తయారీలో అనేకరకాలైన రసాయన పదార్థాలు ఉపయోగించి తయ్యారు చేసి గ్రామాల్లో విక్రయించడం ద్వార ఏమి తెలియని చిన్నారులు తమ తల్లి తండ్రుల నుండి తీసుకున్న డబ్బులతో ఐస్ క్రీములు కొనుగోలు చేసి తినడం ద్వార చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నారని ముందస్తు జాగ్రత్తగా గ్రామంలోని ఎ ఒక చిన్నారులు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ గ్రామ నిబంధనలను అతిక్రమించి గ్రామంలోకి ప్రవేశించి ఐస్ క్రీములు విక్రయిస్తే ఐస్ క్రీం బండ్ల వారికి గ్రామ పంచాయతీ ద్వార 5 వేల జరిమానా విధించబడుతుందని ఫ్లెక్సి ద్వార హెచ్చరించారు.
ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలు సైతం మద్దతు తెలిపి గ్రామంలో నియమ నిబంధనలు పాటించాలని తద్వారా గ్రామాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కాపాడడం అందరి బాధ్యత గా భావిస్తే గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




