PS Raju: IAS పీఎస్ రాజు హఠాన్మరణంపై సంచలన వీడియో లీక్..!
PS Raju: తెలంగాణ శాసనసభ ఆవరణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ పీఎస్ రాజు గుండెపోటుతో మృతి చెందారు.
PS Raju: IAS పీఎస్ రాజు హఠాన్మరణంపై సంచలన వీడియో లీక్..!
PS Raju: తెలంగాణ శాసనసభ ఆవరణలో చోటుచేసుకున్న ఒక విషాదకర సంఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు సచివాలయ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా సేవలందిస్తున్న 50 ఏళ్ల రాజు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల్లో భాగంగా అసెంబ్లీకి వచ్చిన ఒక బాధ్యతాయుతమైన అధికారి, అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అసెంబ్లీ కారిడార్‌లో విధుల్లో బిజీగా ఉన్న రాజు ఒక్కసారిగా అస్వస్థతకు గురై నేలపై కుప్పకూలిపోయారు. ఆయన కిందపడిపోవడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన వద్దకు పరుగులు తీశారు. రాజు ప్రాణాలను కాపాడేందుకు మంత్రి స్వయంగా అక్కడికక్కడే సీపీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు అసెంబ్లీ ఆవరణలో రాజుకు, అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
పోలీసులతో జరిగిన గొడవ వల్ల తీవ్ర మనస్తాపానికి, ఆందోళనకు గురికావడం వల్లే రాజుకు గుండెపోటు వచ్చిందా..?. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటనా లేక వాగ్వాదమే ఆయన ప్రాణాలను తీసిందా అనే కోణంలో కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాలు మరియు విపక్షాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
విధుల పట్ల అంకితభావంతో ఉండే ఒక అధికారిని ఈ రకంగా కోల్పోవడం పట్ల తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అసెంబ్లీ వంటి అత్యున్నత భద్రతా మండలిలో చోటుచేసుకున్న ఈ అసహజ పరిణామంపై వెంటనే ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించాలని, వాగ్వాదానికి దారితీసిన పరిస్థితుల వెనుక ఉన్న అసలు నిజాలను బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




