HYDRAA: లోతుకుంట భూ వివాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన.. సుప్రీంకోర్టు తీర్పుపై కీలక ప్రకటన

HYDRAA: లోతుకుంట 40 ఎకరాల భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 4:31 PM IST
HYDRAA
X

HYDRAA: లోతుకుంట భూ వివాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన.. సుప్రీంకోర్టు తీర్పుపై కీలక ప్రకటన

HYDRAA: లోతుకుంటలో 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కాలపరిమితి ముగియడం వంటి సాంకేతిక కారణాల వల్లే సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని భాగస్వామ్య వర్గాలు మరియు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు.

జనరల్ ల్యాండ్ రిజిస్టర్ (GLR) 243లో పేర్కొన్న 119 ఎకరాల భూములపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా లోతుకుంట భూమి హద్దులు, వాస్తవ పరిస్థితులు పూర్తిగా వెలుగులోకి వస్తాయని చెప్పారు.

లోతుకుంటలోని సర్వే నంబరు 1, 2లోని శాంతా శ్రీరామ్ బిల్డర్స్ లేఔట్‌కు, ప్రస్తుతం హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమికి మధ్య దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉందని హైకోర్టుకు విన్నవించినట్లు గుర్తుచేశారు.

సర్వే నంబర్ 1, 2లోని ప్రైవేట్ భూమికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులకు, జీఎల్ఆర్ నంబర్ 243, 255 భూములకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఈ వివాదంపై ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు కోర్టులను ఆశ్రయించగా, సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.