Rain Alert: భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 4 Aug 2026 10:34 AM IST
Rain Alert
X

Rain Alert: భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

Rain Alert: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వీటికి తోడు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి 'ఎల్లో హెచ్చరికలు' జారీ చేసింది.

వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉండి, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు.

నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో క్యూములోనింబస్ మేఘాల కారణంగా కుండపోత వర్షం కురిసింది. కామారెడ్డిలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు, వాహనదారులు వర్ష సూచనల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story