Hyderabad: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన వైద్య విద్యార్థిని.. చదువు ఒత్తిడే కారణమా?
Hyderabad: హైదరాబాద్ శివారు నాగారంలో తీవ్ర విషాదం. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత ఆత్మహత్య.
Hyderabad: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన వైద్య విద్యార్థిని.. చదువు ఒత్తిడే కారణమా?
Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతమైన నాగారంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం వెస్ట్ గాంధీనగర్‌లోని 'భవానీ ప్యారడైజ్' అపార్ట్‌మెంట్‌లో వడ్లకొండ ఆనందచారి – అరుణ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె దీక్షిత (26) ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి, బెంగళూరు సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ (ఆప్తాల్మాలజీ) మొదటి సంవత్సరం చదువుతోంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఈ నెల 17వ తేదీన బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన దీక్షిత.. శుక్రవారం మధ్యాహ్నం వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన దీక్షితను కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.
చదువు ఒత్తిడే కారణమా?
దీక్షిత ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. తమ కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని, ఎవరిపైనా అనుమానాలు లేవని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదువు ఒత్తిడి (Study Stress) కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.




