Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు కూలిన బహుళ అంతస్తుల భవనం!

Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లోని అంజయ్య నగర్‌లో నాలా పక్కన నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది.

Arun Chilukuri
Updated on: 22 Aug 2026 2:53 PM IST
Hyderabad
X

Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు కూలిన బహుళ అంతస్తుల భవనం!

Hyderabad: రాజధాని నగరంలోని మాదాపూర్ అంజయ్య నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలా పక్కనే 50 గజాల పరిమిత స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం ధ్వంసమై పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో స్థానికులు, సమీపంలోని హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో భవన నిర్మాణ పనుల్లో ఉన్న ముగ్గురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం కూలిపోవడంతో దాని శిథిలాలు ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్ గోడలపై పడ్డాయి. దీనితో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున శబ్దం రావడం, ధూళి అలముకోవడంతో హాస్టల్ విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (DRF) సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాణనష్టం జరగకుండా శిథిలాలను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story