Road Accident: హస్తినాపురంలో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Road Accident: హైదరాబాద్‌లోని హస్తినాపురంలో మద్యం మత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన డ్రైవర్.

Arun Chilukuri
Published on: 8 April 2026 10:50 AM IST
Road Accident
X

Road Accident: హస్తినాపురంలో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Road Accident: హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ జోహెల్‌గా పోలీసులు గుర్తించారు.

శివ,సందీప్ జోహల్ మృతికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story