Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ దందా.. ముషీరాబాద్‌లో తయారీ కేంద్రం సీజ్!

Hyderabad: హైదరాబాద్ ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో బ్లూ బెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 26 March 2026 3:36 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ దందా.. ముషీరాబాద్‌లో తయారీ కేంద్రం సీజ్!

Hyderabad: హైదరాబాద్ ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో బ్లూ బెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. టాస్క్ ఫోర్స్, H-Fast, GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. గడువు ముగిసిన రంగులు ఫ్లేవర్లతో ఐస్ క్రీం తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారీ కొనసాగిస్తున్నారు. 1లక్ష 75 వేల విలువైన 3,759 ఐస్ క్రీం ఉత్పత్తులు సీజ్ చేశారు.

లైసెన్స్ లేకుండా ఐస్ క్రీం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. సుమారు 1,252 లీటర్ల వివిధ ఫ్లేవర్ల ఐస్ క్రీంల స్వాధీనం చేసుకున్నారు. 2,550 పెప్సీ ఐస్ ప్యాకెట్లు, 800 మలై కుల్ఫీలు సీజ్ చేశారు. గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ ఫుడ్ కలర్స్ కూడా భారీగా పట్టుకున్నారు. ఐస్‌క్రీమ్స్ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. నిందితుడు పట్టాల అశోక్ అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story