Jagtial: తల్లి బిడ్డ క్షేమం కోసం పోషకాహారం తప్పనిసరి.. కలెక్టర్ సత్యప్రసాద్

Jagtial: జగిత్యాల జిల్లాలో 'ప్రజా పాలన - 99 రోజుల ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 4:14 PM IST
Jagtial
X

Jagtial: తల్లి బిడ్డ క్షేమం కోసం పోషకాహారం తప్పనిసరి.. కలెక్టర్ సత్యప్రసాద్

Jagtial: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు అనుసరించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం, నియమిత పరీక్షలు మరియు ప్రసవానికి ముందస్తు ఏర్పాట్లపై వైద్యులు సలహాలు సూచనలు చేశారు.

గర్భధారణ సమయంలో తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవానికి (నార్మల్ డెలివరీ) ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్యుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ మహిళలు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం వంటి అంశాలను పాటించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

అలాగే సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తల్లి మరియు శిశువు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) సుజాత, డిప్యూటీ DMHO జైపాల్ రెడ్డి, సూపరిండెంట్ కృష్ణమూర్తి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story