Harish Rao: మోటార్లతో చెలగాటం వద్దు.. మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ!

Harish Rao: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మోటార్లను మాటిమాటికీ ఆన్, ఆఫ్ చేయడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు ఘాటు లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 8 April 2026 10:45 AM IST
Harish Rao
X

Harish Rao: మోటార్లతో చెలగాటం వద్దు.. మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ!

Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న కుట్రనా నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హరీష్ రావు హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story