Hans India Education Awards 2026: హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026.. విద్యార్థుల ఉన్నత కెరీర్‌కు మార్గం చూపే మహాసభ!

Hans India Education Awards 2026: విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి హాన్స్ ఇండియా, హెచ్‌ఎంటీవీ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026’ పేరుతో ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించనున్నాయి.

Rishvik
Published on: 25 March 2026 5:52 PM IST
Hans India Education Awards 2026
X

Hans India Education Awards 2026: హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026.. విద్యార్థుల ఉన్నత కెరీర్‌కు మార్గం చూపే మహాసభ!

Hans India Education Awards 2026: విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి హాన్స్ ఇండియా, హెచ్‌ఎంటీవీ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026’ పేరుతో ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించనున్నాయి. మార్చి 28న ఉదయం 10 గంటల నుంచి బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. విద్య, కెరీర్, నైపుణ్యాలు, నైతిక విలువలు వంటి ముఖ్య అంశాలపై ప్రముఖ నిపుణులు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకోనున్నారు.

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్:

హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అనే అంశంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రొఫెసర్ డి. సుకుమార్, పూర్ణచంద్రరావు నర్రా, కే. కృష్ణ చైతన్య వంటి విద్యా రంగ నిపుణులు విద్యార్థులకు మార్గదర్శనం చేయనున్నారు.

ఏఐ ట్రెండ్స్:

అలాగే విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రెండ్స్, కొత్త నైపుణ్యాలను ఎలా సంపాదించుకోవాలి అనే అంశాలపై మరో కీలక చర్చ జరగనుంది. ఈ సెషన్‌లో ప్రొఫెసర్ హరీష్ రెడ్డి గంత్లా, ఎన్.బి.వి సుబ్బారావు, రాహుల్ పైత్, డాక్టర్ యువరాజు చిన్నం వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు.

ఇన్నోవేషన్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్:

ఇన్నోవేషన్స్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్, లీడర్‌షిప్ లక్షణాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సెషన్‌లో డాక్టర్ ఎం.ఆర్.ఎస్ సూర్యనారాయణ రెడ్డి, ప్రొఫెసర్ సి. మల్లా రెడ్డి, డాక్టర్ కే.ఎస్ వేణుగోపాల్ రావు పాల్గొంటారు.

నైతిక విలువలు, సామాజిక బాధ్యత:

యువతలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సోషల్ మీడియా ప్రభావం నుంచి బయటపడే మార్గాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ సి. వీరేందర్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ సెషన్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

గొప్ప అవకాశం:

ఇంటర్మీడియట్‌ తర్వాత ఏ కోర్సు తీసుకోవలనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్ తర్వాత ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నా.. కోర్సు ఎంపిక చేసుకోవడంలో కాస్త తికమక పడిపోతుంటారు. విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి, అవన్నీ గమ్యాన్ని చేర్చేవే. అయితే వాటిలో ఎవరికి ఏ దారి సరైందో తెలుసుకోవాల్సింది మాత్రం విద్యార్థులే. ఎందుకంటే.. స్పష్టమైన లక్ష్యంతో ఎంచుకున్న కోర్సులే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్,టెక్నీకల్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు తమ స్వీయ సామర్థ్యాలను మదింపు చేసుకుని.. సంపూర్ణంగా విశ్లేషించుకోవాలి. ఇలా జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో హాన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026 కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గదర్శకంగా నిలవనుంది. భవిష్యత్తు కెరీర్‌పై స్పష్టత పొందాలనుకునే వారికి ఈ ఈవెంట్ ఒక గొప్ప అవకాశంగా మారనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story