Habsiguda: ఇంటర్ ఫలితాల్లో వ్యాలివోక్ ప్రభంజనం
Habsiguda: హైదరాబాద్ హబ్సిగూడలోని వ్యాలివోక్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిశారు.
Habsiguda: ఇంటర్ ఫలితాల్లో వ్యాలివోక్ ప్రభంజనం
Habsiguda: హైదరాబాద్ హబ్సిగూడ లోని వ్యాలివోక్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థి సిద్ధాంత 470 మార్కులకుగాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. మొదటి సంవత్సరం బైపిసి పద్మ శ్రేణి 440గాను 438 మార్కులు సాధించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా కళాశాలలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్లు వంశీధర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, పూర్ణ లు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాల తరహాలో చక్కని బోధన చేయడం వల్లనే ఈ ఫలితాలు రావడం జరిగిందన్నారు. ఐఐటీ, నీట్ తరహా పరీక్షలు రాయడానికి అన్ని విధాల విద్యార్థులను సంసిద్ధులను చేయనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులందరినీ అధ్యాపక బృందం సన్మానించి అభినందించారు.




