Karimnagar: ఇల్లందకుంటలో కమనీయం.. సీతారాముల కళ్యాణం!

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 2:37 PM IST
Karimnagar
X

Karimnagar: ఇల్లందకుంటలో కమనీయం.. సీతారాముల కళ్యాణం!

Karimnagar: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం కనువిందుగా సాగింది. ఈ వేడుకను వీక్షించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story