Karimnagar: కనులపండువగా తలంబ్రాల వేడుక.. మహాశక్తి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. బండి సంజయ్ కుమార్ దంపతులు పాల్గొన్న ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 3:27 PM IST
Karimnagar
X

Karimnagar: కనులపండువగా తలంబ్రాల వేడుక.. మహాశక్తి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

కరీంనగర్: వేద మంత్రోచ్చారణాల మధ్య అట్టహాసంగ కొనసాగిన సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు. యగ్నోపవీతం మొదలు కన్యదానం, జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు వరకు సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలను వివరిస్తూ భక్తులను పరవశంలో ముంచెత్తుతున్న వేద పండితులు.

స్వామివారి కల్యాణ వేడుకలు పాల్గొన్న బండి సంజయ్ దంపతులు.

కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకలు తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు అన్ని చర్యలు చేపట్టిన ఆలయ నిర్వాహకులు. మంచినీటి వసతి, భోజనాలు అన్ని సవ్యంగా ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు స్వామివారి తలంబ్రాలను అందించారు.

సీతారాముల కళ్యాణ వేడుకల్లో భక్తులకు రామాయణ గాథకు సంబంధించిన గానాలను ఆలపించిన చిన్నారులు. చిన్నారులను బండి సంజయ్ కుమార్ సన్మానించారు. భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా అందరూ క్రమశిక్షణతో రాముల వారి కళ్యాణ వేడుకలు తిలకించి భోజనాలు చేసి స్వామివారి ముత్యాల తలంబ్రాలను ఆనందంగా తరలి వెళ్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story