Peddapalli: జనసంద్రం కానున్న ఓదెల.. కళ్యాణ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 3:56 PM IST
Peddapalli
X

Peddapalli: జనసంద్రం కానున్న ఓదెల.. కళ్యాణ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష!

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయమైన సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీప అలంకరణలు, పూల అలంకరణలతో ఆలయ ప్రాంగణం వెలిగిపోతోంది. ఈనెల 27న భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలని ఆలయ కమిటీ కోరింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story