Mahabubabad: మహబూబాబాద్‌లో హెచ్‌ఐవి అవగాహన ర్యాలీ.. భారీగా పాల్గొన్న సిబ్బంది
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో హెచ్‌ఐవి అవగాహన ర్యాలీ.. భారీగా పాల్గొన్న సిబ్బంది
మహబూబాబాద్ జిల్లా: హెచ్‌ఐవి/ఎయిడ్స్ పై సమాజంలో అవగాహన పెంపు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం, వ్యాధిపై ఉన్న స్టిగ్మాను తగ్గించడం మరియు నివారణ చర్యలను బలపరచడం లక్ష్యంగా గురువారం మహబూబాబాద్ పట్టణంలో ఘనంగా అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో నిర్వహించారు.ఈ ర్యాలీ జిల్లా కోర్టు మహబూబాబాద్ నుండి ప్రారంభమై ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మహబూబాబాద్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కళాకారుల బృందం సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు హెచ్‌ఐవి నివారణ, సురక్షిత జీవన విధానాలపై సందేశాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ, హెచ్‌ఐవి వ్యాధి పట్ల భయం అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, హెచ్‌ఐవి బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అర్జున్ హెచ్‌ఐవి నివారణలో జాగ్రత్తలు, సురక్షిత చర్యలపై వివరించారు.నర్సింగ్ విద్యార్థులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, సర్వోదయ యువజన స్వచ్చంద సంస్థ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం జిల్లా కారాగారం లో హెచ్‌ఐవిల/ టిబి/ హెపటైటిస్ మొదలగు వాటిపైన ఖైదీలకు స్క్రీనింగ్ నిర్వహించబడింది. తదుపరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక హెల్త్ కాంప్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఎస్‌యూవో వడ్డేబోయిన శ్రీనివాస్, హెచ్‌ఐవి/ఎయిడ్స్ సిబ్బంది దిశ సారంగం, ఐసిిటిసి’ కౌన్సిలర్ రమేష్, వీరస్వామి, ఎస్‌ఎస్‌కే రమేశ్ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ నుండి శాంతారాజ్ వారి సిబ్బంది, వర్డ్ స్వచ్చంద సంస్థ సిబ్బంది, లింక్ వర్కర్ సిబ్బంది కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు.


