Rajendranagar: ఆరోగ్యమే బలం.. జీహెచ్ఎంసీ కార్మికుల కోసం హెల్త్ క్యాంప్

Rajendranagar: రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు. బి.పి, షుగర్ పరీక్షలతో పాటు మందుల పంపిణీ.

ANJAIAH, SHAMSHABAD
Published on: 7 April 2026 3:14 PM IST
Rajendranagar
X

Rajendranagar: ఆరోగ్యమే బలం.. జీహెచ్ఎంసీ కార్మికుల కోసం హెల్త్ క్యాంప్

Rajendranagar: గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ శిబిరంలో వైద్యులు కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, షుగర్, హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై వైద్యులు కార్మికులకు అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, వైద్య బృందం పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ఈ చర్యలను కార్మికులు అభినందించారు. AMHO రజినీకాంత్ వార్డు సూపర్వైజర్ ఉదయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story