Karimnagar: కరీంనగర్ లక్ష రూపాయల లక్కీ డ్రా విజేత ఎవరంటే?

Karimnagar: కరీంనగర్ జ్యోతి నగర్‌లోని 'ద బ్రాండ్ ఫ్యాక్టరీ' వస్త్ర దుకాణంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 9:50 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ లక్ష రూపాయల లక్కీ డ్రా విజేత ఎవరంటే?

కరీంనగర్: జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ లో గల ద బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణంలో శుక్రవారం రోజున లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచాన్ని అందించి శాలువాతో సత్కరించారు.

అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన.. బాక్స్ లో నుండి రెండు చిట్టి లను తీసి మొదటి ద్వితీయ విజేతలను ప్రకటించారు. విజేతలకు కాల్ చేసి.. స్వయంగా ఎమ్మెల్యే అభినందించారు. మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా 50వేల రూపాయలు.. అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు..

జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ , మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్ , మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, బ్రాండ్స్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణం మేనేజింగ్ డైరెక్టర్ సత్యపాల్ , స్టోర్ నిర్వాహకులు పులి అజయ్, రాయుడు, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు.. స్టోర్ సిబ్బంది.. తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story