Karimnagar: ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ల పండుగ.. కరీంనగర్ బీజేపీ పిలుపు

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 April 2026 9:30 PM IST
Karimnagar
X

Karimnagar: ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ల పండుగ.. కరీంనగర్ బీజేపీ పిలుపు

Karimnagar: నారీశక్తి వందన్ (మహిళా రిజర్వేషన్ బిల్లు) పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం మూడో వంతు సీట్లను రిజర్వ్ చేస్తూ , రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే చారిత్రక చట్టం అమలుకు కౌంట్ డౌన్ మొదలైందని, ఏప్రిల్ 16న చట్టం అమలు కాబోతున్న శుభ సందర్భంలో బిజెపి శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

శనివారం సాయంత్రం బిజెపి ముఖ్య నేతలు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లతో నారీ శక్తి వందన్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలవుతున్న నేపథ్యంపై, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని బిజెపి శ్రేణులకు దిశా నిర్దేశనం చేయడానికి సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు నిలిచిపోయిన మహిళల హక్కుఇప్పుడుసాకారమవుతుందన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభిస్తుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లు చారిత్రకమైందన్నారు. రాజకీయాల్లో మహిళలకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వతంత్ర, న్యాయమైన వాటా కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ చారిత్రక ఘట్టం , మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో బిజెపి శ్రేణులు సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

మహిళలు ఈ సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషిచేసి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. అలాగే ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి , రాష్ట్ర నాయకులు ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం , మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్లు, మండల, జోన్ అధ్యక్షులు , జిల్లా ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story