Jukkal: గ్రామంలో క్రికెట్ సంబరాలు.. యువతలో ఉత్సాహం
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కంఠాలి గ్రామంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్‌ను సర్పంచ్ నాగ్ నాథ్ ప్రారంభించారు.
Jukkal: గ్రామంలో క్రికెట్ సంబరాలు.. యువతలో ఉత్సాహం
Jukkal: జుక్కల్ (కామారెడ్డి) క్రీడలతో క్రీడాకారుల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందని కంటలి గ్రామ సర్పంచ్ నాగ్ నాథ్ అన్నారు. జుక్కల్ మండలం కంఠాలి గ్రామంలో ఆదివారంక్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ సభ్యుల సహకారం తో ప్రెండ్లి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ముఖ్యమని అన్నారు.
ఈ క్రీడల ద్వార ఐక్యత స్నేహభావం పెరుగుతుందన్నారు. ప్రతి క్రీడలలో క్రీడాకారులకు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఓటమి అనేది గెలుపుకు నందిగా భావించాలని ఓటమి చెందే వారు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా రేపటి గెలుపు కోసం కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. క్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు పోటీలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వార మన గ్రామ అభివృద్ధి కి, యువత ప్రోత్సాహానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు.
పోటీలో పాల్గొన్న క్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు.
జుక్కల్ మండలం కంటలి గ్రామంలో క్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ వారు నిర్వహిస్తున్న ప్రెండ్లి క్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు ప్రవీణ్, జ్ఞానేశ్వర్, వాగుమారే. మారుతి, గౌలె. శ్రీరంగ్, ఉప సర్పంచ్ బాబు రావ్ తదితరులు పాల్గొన్నారు.




