Tandur: క్యాన్సర్‌ను తరిమేద్దాం రండి!
Tandur: తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం తాండూరు ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Tandur: క్యాన్సర్‌ను తరిమేద్దాం రండి!
Tandur: తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం తాండూరు ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రేపు ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయితరుణ్ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమేయడం అందరి బాధ్యత అని తాండూరు ఐఎంఏ అధ్యక్షులు, సాయి తరుణ్ ఆసుపత్రి వైద్యులు డా. జయప్రసాద్ అన్నారు.
ప్రముఖ అంకాలజీస్ట్ డా. మధుదేవర శెట్టి, డా. తోట నరేందర్ కుమార్, 10 మంది వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో రూ. 20వేల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. ఇందులో మాబోగ్రఫీ, పాప్ స్మీయర్, బోత్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్ రే, ఎండోస్కోప్, అల్ట్రాసౌండ్ అబ్డామిస్ అండ్ పెల్పస్‌తో పాటు వైద్యుల సూచన మేరకు సీబీపీ, సీఏ-125, సీఏ-19.9, పీఎస్‌ఏ పరీక్షలు చేస్తారని చెప్పారు.
దీంతోపాటు ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తించే క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్‌పై అనుమానం ఉన్న వారు వారి పాత రిపోర్టులు తీసుకుని పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఎండోస్కోపింగ్ చేసుకునే వారు ఎలాంటి ఆహారం తినకుండా రావాలని సూచించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.




