Karimnagar: ముక్కుపిండి పన్ను వసూలు చేయండి
Karimnagar: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ క్లబ్, టీఎన్జీవో మరియు ఎక్సైజ్ కాంప్లెక్స్ ల నుండి కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేసింది.
Karimnagar: ముక్కుపిండి పన్ను వసూలు చేయండి
కరీంనగర్: ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావానిలో జిల్లా కలెక్టర్ కి పెండింగ్లో ఉన్న కరీంనగర్ రెవెన్యూ క్లబ్ కాంప్లెక్స్ కోటి రూపాయలు, టీఎన్బీవో భవన్ కాంప్లెక్స్ 90 లక్షలు మరియు ఎక్సైజ్ కాంప్లెక్స్ లక్షల రూపాయలకు పైగా ఉన్న పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ లను తక్షణమే వాసులు చేయాలనీ, ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ ఇచ్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరామించికోవాలని పిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడంలో కరీంనగర్ రెవెన్యూ క్లబ్, కాంప్లెక్స్, టీఎనీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యాహరిస్తున్నారు విమర్శించారు. ప్రతి నెల లక్షల్లో కిరాయిలు వస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పెద్ద ఎత్తున పైరవీలు చేసుకువడం సిగ్గు చెటని విమర్శించారు.
రెవెన్యూ క్లబ్ కాంప్లెక్స్ 35 షటర్లు, రెవిన్యూ గార్డెన్ , రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ అద్దెల రూపంలో వచ్చే ఆదాయాన్ని అసోసియేషన్ లీడర్స్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడడం, ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ మున్సివల్ కార్పొరేషన్ కు కట్టాల్సిన ప్రాపర్టీ టాక్స్ దాదాపుగా గత 30 సంవత్సరాలుగా ఎగ్గొట్టడం జరుగుతుందని అన్నారు. రెవిన్యూ క్లబ్ కాంప్లెక్స్ , ఎక్సైజ్ నిర్వహకులు కలెక్టరెట్ ఎదురుగా ఉన్న కమర్షియల్ షటర్స్ కిరాయిలకు ఇచ్చి వారి వద్ద నెల నెలా అద్దెను 15 వేల నుండి 20వేల వరకు వసూలు చేస్తున్న రెవిన్యూ , ఎక్సైజ్ అసోసియేషన్, లీడర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
సామాన్యులకు ఉపన్యాయం సంఘ భవనాలకు ఒక న్యాయమా..
ఎక్సైజ్ కాంప్లెక్ లు మరియు రెవిన్యూ క్లబ్ షెటర్స్ అధికారులకు, వారి బినామీలకె ఒక్కరికి రెండు షెటర్స్ లు ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ లీడర్లు కుమ్మక్కై ఇప్పటి వరకు రెవెన్యూ కాంప్లెక్స్పై కోటి రూపాయలకు పైగా, టీఎన్జవో కాంప్లెక్స్ 90 లక్షలు, ఎక్సైజ్ కాంప్లెక్స్ లక్షల రూపాయలు బకాయిలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పొవడం ఏమి మతాలబు ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రెవెన్యూ క్లబ్, కాంప్లెక్స్, టీఎనీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ అధికారులు, లీడర్లు పైరవీలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాయితీలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వాలని , ముక్కుపిండి ప్రాపర్టీ ట్యాక్స్ వాసులు చేయాలనీ కోరారు.
సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ కరెంట్, నల్లా కనెక్షన్ కట్ చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు రెవెన్యూ కాంప్లెక్స్, టీఎన్బీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్స్ విషయంలో మాత్రం చూసీచూనడట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో తమరే గుర్తించగలరు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కాంప్లెక్స్, టీఎన్టీవో కాంప్లెక్స్, ఎక్సైజ్ కాంప్లెక్లకు రాయితీలు ఇవ్వకూడదని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రాపర్టీ టాక్స్ చెల్లించకుండా ఎగొగ్గడుతున్న సంస్థలపై, ఆ సంస్థల అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రినేత, పార్టీ నాయకులు లచ్చయ్య ఉన్నారు.




