కాంగ్రెస్ సర్కార్‌పై సర్పంచుల యుద్ధం.. అరెస్టులతో ఆగదు ఈ పోరాటం!

Gangadhara: పెండింగ్ బిల్లుల కోసం 'చలో హైదరాబాద్'కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచుల అరెస్ట్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉద్రిక్తత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 8:42 PM IST
Gangadhara
X

కాంగ్రెస్ సర్కార్‌పై సర్పంచుల యుద్ధం.. అరెస్టులతో ఆగదు ఈ పోరాటం!

Gangadhara: పెండింగ్‌ బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ తాజా మాజీ సర్పంచ్‌లు చలో హైదరాబాద్‌ తలపెట్టిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ఇండ్ల వద్దనే అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినప్పటికీ తమకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. తమ బిల్లులు అందించాలని డిమాండ్‌ చేస్తే అరెస్టు చేస్తారా అని వారు ప్రశ్నించారు. బిల్లులు మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని మాజీ సర్పంచులు స్పష్టం చేశారు.

గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి, ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాజీ సర్పంచుల జీవితాలతో రాజకీయ చెలగాట మాడుతోందన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంకు ఎన్నిసార్లు తమ బిల్లులు చెల్లించాలని విన్నవించినా ఫలితం లేదన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, గ్రామాల్లో అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో జేఏసీ రాష్ట్ర నాయకులు వేముల దామోదర్ మడ్లపల్లి గంగాధర్ తదితరులు ఉన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story