Siddipet: అడవిలో మంటలు.. భయాందోళనలో గ్రామస్థులు!

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 5:42 PM IST
Siddipet
X

Siddipet: అడవిలో మంటలు.. భయాందోళనలో గ్రామస్థులు!

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామం నుండి హబ్సిపూర్ వెళ్లే అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అడవిలో ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు అడవిలో నిప్పులు చెలరేగయా లేక కావాలనే ఎవరైనా నిప్పంటించారానే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించి స్థానికులు తెలపడంతో మంటలను త్వరగా అదుపులోకి తీసుకురావడం జరిగిందని అగ్మాపక సిబ్బంది తెలియజేశారు. లేదంటే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉండేదన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story