Kapra: ప్రజా పాలనలో భాగంగా ఈ-వ్యర్థాల సేకరణ

Kapra: కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఎన్విరోకేర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ క్లీన్‌నెస్ డ్రైవ్ నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 12 April 2026 7:33 PM IST
Kapra
X

Kapra: ప్రజా పాలనలో భాగంగా ఈ-వ్యర్థాల సేకరణ

Kapra: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను పారవేయకుండా రీసైక్లింగ్ చేసే విధంగా చూడాలని ఎన్విరోకేర్ రీసైక్లింగ్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓలు ఎస్. నరేష్ రాజ్, భరత్ E వేణుగోపాల్ అన్నారు. ఉప్పల్ జోన్ పరిధి కాప్రా సర్కిల్ కార్యాలయం ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ వేస్ట్ క్లీన్నెస్ డ్రైవ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్, ఎలక్ట్రానిక్స్ వ్యర్ధాల సురక్షిత రీసైక్లింగ్ ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని మరియు సహజ వనరులను పరిరక్షించడమే ధ్యేయంగా ఎన్విరోకేర్ సంస్థ కృషి చేస్తుందని గుర్తు చేశారు. ఈ వ్యర్థాల నిర్వాహన పద్దతులను ప్రజలకు వివరించారు. ఎన్విరోకేర్ సంస్థ మేనేజర్ సచిన్, సిబ్బంది మహమ్మద్ యాహ్య, శివ ప్రసాద్, ఎండి ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story