Hyderabad: మందుబాబులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్!

Hyderabad: హైదరాబాద్ నగరంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది.

Arun Chilukuri
Published on: 26 March 2026 1:43 PM IST
Hyderabad
X

Hyderabad: మందుబాబులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్!

Hyderabad: హైదరాబాద్ నగరంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. రేపు (మార్చి 27, శుక్రవారం) శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జంటనగరాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.

నగరవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ 'డ్రై డే' నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీపీ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపినా లేదా షాపులు తెరిచినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైన్ షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు

రేపు రోజంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలియడంతో నగరంలోని మద్యం ప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రేపటి కోటాను కూడా ఈరోజే కొనుగోలు చేసేందుకు సిద్ధపడటంతో వైన్ షాపుల వద్ద సందడి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story