Hyderabad: బంజారాహిల్స్‌లో ఆటిజంపై భారీ అవగాహన ర్యాలీ
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద దివీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో ఆటిజం అవగాహన నడక నిర్వహించారు.
Hyderabad: బంజారాహిల్స్‌లో ఆటిజంపై భారీ అవగాహన ర్యాలీ
Hyderabad: ఆటిజం వ్యాధిని ముందస్తుగానే గుర్తిస్తే ఆ పిల్లలకు మంచి శిక్షణతో పాటు మంచి వైద్యం అందించి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని దివీస్ ల్యాబరేటరీస్ ఎండి డాక్టర్ మురళి కృష్ణ దివి అన్నారు. ఆటిజం అవగాహన నెలలో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆయన ఆటిజం అవగాహన నడకను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 300మందికిపైగా దివీస్ ల్యాబరేటరీస్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ దివి మాట్లాడుతూ ప్రతియేటా 100 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతియేటా అవగాహన కార్యక్రమాలతో పాటు అవగాహన నడకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఈడీ ఎన్.వి. రమణ, డైరెక్టర్ నీలిమా ప్రసాద్ దివి, ఎల్. కిషోర్‌బాబు, ఎల్. రమేష్‌బాబు, డి. మధుబాబు, కె. సుబ్బారావు, మను జాస్తి, బి. వర ప్రసాద్, డాక్టర్ ప్రమోద్, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




