Kamareddy: మాజీ కలెక్టర్ సేవలను గుర్తు చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు

Kamareddy: కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హైదరాబాద్‌లో టీజీ రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 March 2026 1:45 PM IST
Kamareddy
X

Kamareddy: మాజీ కలెక్టర్ సేవలను గుర్తు చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు

Kamareddy: నిజాంసాగర్ (కామారెడ్డి) తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ చైర్ పర్సన్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ ను శుక్రవారం కామారెడ్డి జిల్లా డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా సత్య నారాయణ కు పుష్పగుచ్ఛం బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు.

భేటి సందర్భంగా డాక్టర్. ఎన్. సత్యనారాయణ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉంటూ జిల్లా అభివృద్ధి కి చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యంగా 2016 నుండి 2020 వరకు ఐదేండ్ల పాటు ఆయన నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పరి పాలన, ప్రజల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలు జిల్లా ప్రజల మన్ననలు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన పరి పాలనలో జిల్లా అభివృద్ధి దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

డి సి సి అధ్యక్షుడి కృషిని అభినందించిన డాక్టర్. ఎన్.సత్యనారాయణ.

కామారెడ్డి డి సి సి అధ్యక్షుడి గా ఎన్నికై జిల్లా రాజకీయాల్లో తన దైన శైలిలో చురుకైన పాత్ర పోషిస్తున్న డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కామారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం లో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story