Uppal: పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా 'ఇంటింటికీ సిపిఐ
Uppal: ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్. బోస్ ప్రారంభించారు.
Uppal: పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా 'ఇంటింటికీ సిపిఐ
Uppal: ప్రజలకు మరింత చేరువవ్వడం, కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 'ఇంటింటికి సిపిఐ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి యస్. బోస్ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ లోని హెచ్ బీ కాలనీ డివిజన్ లోని ఇంద్ర నగర్, కైలాసగిరి, రాజీవ్ నగర్, నవోద్దయ నగర్, బక్షిగూడ ప్రాంతాల్లో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని బోస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్ మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల హక్కుల పరిరక్షణ, సమాజంలో దోపిడీ, పీడనలేని వ్యవస్థ అయిన సోషలిజం లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలను నిర్మిస్తోందన్నారు. అనుబంధ సంఘాల ద్వారా వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను నడుపుతుందని తెలిపారు. నేడు సమాజంలో పాలకవర్గాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాల్లో పాల్గొనాలనే ఆకాంక్ష అనేక ప్రజల్లో ఉన్నప్పటికీ తమ వృత్తిరీత్యా వ్యక్తిగత పనులు,
అవసరాల రిత్యా సమయాన్ని కేటాయించలేకపోవచ్చు కానీ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న మహత్తరమైన రాజకీయ పోరాటంలో ఆర్ధికంగా సహకరించి ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రజలు సహకరించాలని బోస్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 1 నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వస్తున్న సిపిఐ కార్యకర్తలు, నాయకులకు అన్ని రకాలుగా చేయూతను అందించి పటిష్టమైన పార్టీ నిర్మా ణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్,ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు నర్సింహా రావు, సీపీఐ హెచ్ బీ కాలనీ డివిజన్ నాయకులు స్వామిదాస్, జాన్, ఎస్. నాగేష్, శ్రీను, శ్రీనివాస్, ఎల్లయ్య, జమిలయ్య, వెంకటమ్మ, లక్ష్మీ లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.




