Jagga Reddy: గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలా? కేటీఆర్‌పై మండిపడ్డ జగ్గారెడ్డి
Jagga Reddy: సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Jagga Reddy: గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలా? కేటీఆర్‌పై మండిపడ్డ జగ్గారెడ్డి
జగ్గారెడ్డి: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి జగ్గారెడ్డి కౌంటర్, జగ్గారెడ్డి కామెంట్స్,సరూర్ నగర్ సభలో కేటీఆర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు డెత్ డిక్లరేషన్ అన్నారు. అసలు కేటీఆర్ కి నియత్ ఉందా.
సోనియాగాంధీ దయాతోనే కదా తెలంగాణ వచ్చింది పదేళ్లు సోనియాగాంధీ దయతో రాజభోగాలు అనుభవించారు కదా.తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు, కూతుర్ల చావు కోరుకుంటావా, ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియాగాంధీకి తన చర్మ వొలిచి చెప్పులు కుట్టిస్తా అన్నారు.
తెలంగాణ ఇచ్చాక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా వెళ్లి సోనియా కాళ్ళు మొక్కిన సంగతి మర్చిపోయారా. ఇప్పుడేమో వాళ్లపైనే డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నావు.
నీ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఆ కుటుంబం నాశనం కోరుకుంటావా. మీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులకు సమాధానం చెప్పారా.
విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబంది అయితే...విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబంవి, మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ కుటుంబంది.మాట ఇస్తే మోసం చేసేది కేసీఆర్ కుటుంబంది.




