Mutharam: శ్రీపాదరావు ప్రస్థానం స్ఫూర్తిదాయకం కలెక్టర్ శ్రీహర్ష
Mutharam: మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు.
Mutharam: శ్రీపాదరావు ప్రస్థానం స్ఫూర్తిదాయకం కలెక్టర్ శ్రీహర్ష
Mutharam: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.
మారుమూల ప్రాంత మైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో పుట్టి ఉపాధ్యాయుడు, గ్రామ సర్పంచ్, నుండి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన గొప్ప మహనీయుడు శ్రీపాదరావు అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలోనే వారి కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు.
మంథని పట్టణ శివారులోని అయ్యగారి చెరువు పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల ఆఖరి వరకు అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనుల్లో 50 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు పునః నిర్మానం పనులు వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలని అధికారులకు సూచించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.




