Revanth Reddy: గ్రామాల్లోకి హైస్పీడ్ ఇంటర్నెట్: టీ-ఫైబర్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

Revanth Reddy: తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే టీ-ఫైబర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 28 May 2026 10:48 AM IST
Revanth Reddy
X

Revanth Reddy: గ్రామాల్లోకి హైస్పీడ్ ఇంటర్నెట్: టీ-ఫైబర్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

Revanth Reddy: గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేయడం., పెండింగ్లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడం వంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. మండల స్థాయి నుంచి గ్రామపంచాయతీల వరకు ఏర్పాటు చేసిన రింగ్ నెట్ వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం రూపొందించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story