Karimnagar: కొత్త పాలకవర్గం.. సరికొత్త లక్ష్యం చొప్పదండిలో మున్సిపల్ నేతల సన్మాన వేడుక
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
Karimnagar: కొత్త పాలకవర్గం.. సరికొత్త లక్ష్యం చొప్పదండిలో మున్సిపల్ నేతల సన్మాన వేడుక
కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం…
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్టడీ సర్కిల్‌లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణాన్ని శుభ్రంగా, సక్రమంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నాయకులు, సంఘ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెరుమాండ్ల మానస కౌన్సిలర్ లు మరియు కాంగ్రెస్ నాయకులు గంగయ్య గౌడ్ కొట్టే అశోక్ ముద్దం తిరుపతి గౌడ్ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




