Chiryala: చీర్యాల స్వామి దర్శనంతోనే నా విజయం.. మల్లారెడ్డి
Chiryala: మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని చీర్యాల లక్ష్మీనరసింహస్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి హాజరు.
Chiryala: చీర్యాల స్వామి దర్శనంతోనే నా విజయం.. మల్లారెడ్డి
Chiryala: శ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి వారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు నవ కళాశాభిషేకం విశ్వక్సేన పూజ అగ్ని ప్రతిష్టతో శ్రీ సుదర్శన నారసింహ హోమం వేద పండితుల మంత్రోచ్ఛరణ తో ఆలయ ఫౌండర్& చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, బ్రహ్మోత్సవాలలో
మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీరికి ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేదపండితుల తో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రాలు తీర్థప్రసాదాలతో ఘనంగా ఆశీర్వచనం అందజేశారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మొదటిసారి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోగానే ఎంపీ టికెట్ వచ్చిందని ఘనవిజయం సాధించానని తదుపరి మంత్రిని కూడా అయ్యానని ఈ లక్ష్మీనరసింహస్వామి రాజకీయ నాయకులకు కూడా కొంగుబంగారమని కల్సొచ్చే దేవుడని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించదలచినమని జిల్లాల నుంచే కాదు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి భక్తులు విచ్చేస్తున్నారని మన యొక్క చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి చరిత్ర దేశమంతా పాకిందని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరి వెంకటేష్ ,మాధురి వెంకటేష్ సుధాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి శ్రీనివాస్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




