Peddapalli: ఇచ్చిన హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓట్లు అడుగుతా!

Peddapalli: సుల్తానాబాద్ 10వ వార్డు సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు. జూన్ 2 నుండి రేషన్ కార్డుదారులకు బీమా పథకం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 4:34 PM IST
Peddapalli
X

Peddapalli: ఇచ్చిన హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓట్లు అడుగుతా

Peddapalli: సుల్తానాబాద్ పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం రోజున ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన10 వ వార్డు సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు. తదుపరి గర్రెపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని, లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే విజయరమణా రావు గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ..

రైతు బీమా మాదిరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇట్టి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవం అయినటువంటి జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వ బడులలో చదివి విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సమకూర్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు అంటే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

అభివృద్ధి విషయంలో సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతానని, ప్రజల ఆశీస్సులతో తాను ఆ ధీమా తో పనిచేస్తున్నట్టు చెప్పారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అద్దంలాగా తయారు చేస్తానని చెప్పారు. ఇప్పటికే సుల్తానాబాద్ పట్టణంలో కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ, ఆధునికరణ చేసి అందంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ఆధునికరించిన బీటీ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు.

మరి కొద్ది రోజుల్లో అర్హులైన వారి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలో చాలామంది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదని, ఈ దిశగా అధికారులు అవసరమైన ప్రయత్నాలు చేయటం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంటనే రివ్యూ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కౌన్సిలర్లు చింతల రాజు, గరిగే శోభారాణి, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ డిఈఈ, ఏఈ, గర్రెపల్లి పిహెచ్ సీ డాక్టర్లు, సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story