కాంగ్రెస్‌ పార్టీలో సంచలన పరిణామాలు.. చిన్నారెడ్డిపై వేటు, ప్లానింగ్ కమిషన్ వైస్‌ ఛైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం!

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం. ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి జిల్లెల చిన్నారెడ్డి తొలగింపు.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 3:30 PM IST
కాంగ్రెస్‌ పార్టీలో సంచలన పరిణామాలు.. చిన్నారెడ్డిపై వేటు, ప్లానింగ్ కమిషన్ వైస్‌ ఛైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం!
X

కాంగ్రెస్‌ పార్టీలో సంచలన పరిణామాలు.. చిన్నారెడ్డిపై వేటు, ప్లానింగ్ కమిషన్ వైస్‌ ఛైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం!

Congress: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం, తాజాగా సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డిపై కూడా వేటు వేసింది. ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎండ్‌కార్డ్ పడింది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, తొలుత చిన్నారెడ్డికి ప్రకటించిన వనపర్తి టికెట్‌ను ఆ తర్వాత మేఘారెడ్డికి కేటాయించడం ఇరు నేతల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. ఇటీవల గోపాల్‌పేట వేదికగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ గాంధీభవన్, టీపీసీసీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కూడా చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సిఫార్సు చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు, వర్గపోరు నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story