Karimnagar: తగ్గిన చికెన్ రేటు.. చికెన్ లవర్స్‌కు గుడ్ న్యూస్
Karimnagar: కరీంనగర్‌లో ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.270 నుంచి రూ.300 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి.
Karimnagar: తగ్గిన చికెన్ రేటు.. చికెన్ లవర్స్‌కు గుడ్ న్యూస్
కరీంనగర్: ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి.
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు.. కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు..
చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది.
వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. కరీంనగర్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.300 గా ఉండగా అటు పక్క జిల్లాలోనూ అదే ధర కొనసాగుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు అంటున్నారు.




