Karimnagar: రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. బీజేపీని ఓడిద్దాం!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మైదానంలో ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 4:50 PM IST
Karimnagar
X

Karimnagar: రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. బీజేపీని ఓడిద్దాం!

కరీంనగర్: బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ మాయావతి ఆదేశాల మేరకు ఈ నెల 14 వ తేదీ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని పుష్కరించుకొని కరీంనగర్ పార్లమెంట్ కేంద్రం లో అంబేద్కర్ జయంతి సభ ను మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మైదానం లో నిర్వహిస్తున్నామని బీఎస్పీ జోన్ ఇంచార్జ్ మాతంగి అశోక్ తెలిపారు. ఈ రోజు అందుకు సంబందించిన గోడ పత్రిక ను విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతు ఈ బహిరంగ సభ కు బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ముఖ్య అతిథి గా హాజరువుతున్నారు అని తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లో మనుధర్మ శాస్త్రం వలన వేలాది సంవత్సరాలుగా బానిసలూ గా ఉన్న ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు. బహుజన కులాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రకుల మహిళలు భారత రాజ్యాంగం ద్వారా లబ్ది పొందినారు. కానీ నేడు రాజ్యాంగం ప్రమాదం లో పడింది. కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాజ్యాంగం ను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది అన్నారు. వారి నుండి రాజ్యాంగం ను కాపాడుకోవడానికి మనం ఓటు హక్కు ద్వారా బీజేపీ ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడు రాజ్యాంగం ను పూర్తి స్తాయి లో అమలు చేయకపోవడం వలన దేశం లో పేదరికం నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. నేడు కేంద్ర లో అధికారం లో ఉన్మ బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థ లను అమ్మేసి పేదరికo నిరుద్యోగం ని పెంచుతుందన్నారు. అందుకే ప్రజలందరిని రాజకీయ చైతన్యం చేయడానికి బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ సభ జరుపుతున్నామని అయన తెలిపారు. ఈ కార్యక్రమం లో జోన్ ఇంచార్జ్ పల్లె ప్రశాంత్ గౌడ్, పార్లమెంట్ ఇంచార్జ్ లు కళ్లేపల్లి రాజేందర్, దొడ్డే శ్రీనివాస్, బోయిని బాబు మానకొండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ అంబాలా శతీష్, జిల్లా మాజీ కార్యదర్శి మాతంగి మల్లయ్య లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story