Osmania University: ఓయూలో ఘనంగా భారతీయ శిక్షణ మండలి వేడుకలు

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో భారతీయ శిక్షణ మండలి 57వ స్థాపన దినోత్సవం ఘనంగా జరిగింది.

HARISH, TARNAKA
Published on: 11 April 2026 9:15 PM IST
Osmania University
X

Osmania University: ఓయూలో ఘనంగా భారతీయ శిక్షణ మండలి వేడుకలు

Osmania University: ఓయూలో జరిగిన బి ఎస్ ఎం 57వ స్థాపన దినోత్సవం మెకాలే విద్యా విధానాన్ని పారదోలి భారతీయ విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని భారతీయ శిక్షణ మండలి ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఆర్ శంకరానంద్ పేర్కొన్నారు. భారతీయ శిక్షణ మండలి 57వ ఫౌండేషన్ డే ని శనివారం ఉస్మానియా యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ హాలులో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన బి ఎస్ ఎం అఖిలభారత ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఆర్ శంకరానందు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యం భారతీయ విద్యతోనే సాధ్యమని ఇందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టం ద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు భారతీయ శిక్షణ మండలి పనిచేస్తుందని వివరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎంతో యువశక్తి ఉందని దీనిని మానవ వనరులుగా మార్చుకున్నప్పుడు భారత్ బలం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను విస్తృతమైన ఉపాధి అవకాశాలు పొందేలా కృషి చేస్తూ తెలంగాణ రైజింగ్ కు పాటుపడుతున్నామన్నారు. ఇందుకు సిలబస్ మార్చడంతో పాటు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని వివరించారు.

ఈ కార్యక్రమానికి బి ఎస్ ఎం తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ, సెక్రటరీ ప్రొఫెసర్ ఉమా, తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి దేవరాజ్ తోపాటు బి ఎస్ ఎం కార్యవర్గ సభ్యులు, వివిధ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story