Peddapalli: ఫీజు బకాయిల పోరు విద్యార్థి నేతల అరెస్టులతో ఓదెలలో హల్ చల్
Peddapalli: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీఆర్‌ఎస్వీ చలో అసెంబ్లీ పిలుపు.. ఓదెల మండలంలో బీఆర్‌ఎస్ యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్.
Peddapalli: ఫీజు బకాయిల పోరు విద్యార్థి నేతల అరెస్టులతో ఓదెలలో హల్ చల్
Peddapalli: ఓదెల పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్వీ (BRSV) రాష్ట్ర కమిటీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు.
మంగళవారం ఉదయం పోత్కపల్లి పోలీసులు బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్వీ మరియు బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




