Narsingi: ఖర్గే దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణుల నిరసన!
Narsingi: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Narsingi: ఖర్గే దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణుల నిరసన!
Narsingi: బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షులు మెండే నాగేష్ ఆధ్వర్యంలో బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దుద్దాల లక్ష్మినారాయణ లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
దేశంలో ప్రపంచ దేశాలలో బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి చౌకబారు మాటలను మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, శివరాజ్, మన్నే సురేష్, మల్లేష్, బ్రాహ్మచారి, అరవింద్,చెన్నయ్య, ఎమ్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .


