Bandi Sanjay: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్: "దక్షిణాది పేరుతో దేశాన్ని విడగొడతారా?"
Bandi Sanjay: దక్షిణాది వివక్ష పేరుతో సీఎం రేవంత్ రెడ్డి విభజన రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Bandi Sanjay: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్: "దక్షిణాది పేరుతో దేశాన్ని విడగొడతారా?"
Bandi Sanjay: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాంతీయ అసమానతల పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాలకు తెరలేపిందని ఆయన విమర్శించారు.
విభజన రాజకీయాలు ఎందుకు?
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. "ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారు? మీలో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కనిపించవా? దేశాన్ని విభజించాలని చూస్తున్నారా?" అని ప్రశ్నించారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు మొదలైందని, అందుకే 'దక్షిణాది అన్యాయం' అనే జిమ్మిక్కులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేంటని బండి సంజయ్ నిలదీశారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో రేవంత్ రెడ్డి అంటకాగుతున్నారని ఆరోపించారు.
ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచితే అభ్యంతరం ఏంటని, మహిళా ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని ధ్వజమెత్తారు.
తమిళనాడు, కేరళ ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ పాచికలు అక్కడ పారవని బండి సంజయ్ పేర్కొన్నారు. విభజన రాజకీయాలు చేసే వారికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.




