Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 3:37 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ 47వ ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యపురి కాలనీలోని తన నివాసం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక పండగల నిర్వహించుకోవాలని బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రతి వాడవాడలో బిజెపి జెండాలు ఎగరవేయాలని సూచించారు. అతి తక్కువ సమయంలో ప్రజల ఆదరణ చురగొని దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఏర్పడిందని అన్నారు. దేశం ముఖ్యం పార్టీ తర్వాత అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజల మనసు గెలుచుకుందన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్,రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి & డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు,బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ,నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story