Kapra: ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.. సాకేత్ వెల్ఫేర్ అసోసియేషన్
Kapra: కాప్రా డివిజన్ సాకేత్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని బీఆర్‌ఎస్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ ఘనంగా సత్కరించారు.
Kapra: ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.. సాకేత్ వెల్ఫేర్ అసోసియేషన్
Kapra: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం సాకేత్ నూతన కమిటీకి కాప్రా డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు బీఆర్‌ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్, పార్టీ నాయకులతో కలిసి సాకేత్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ
అధ్యక్షులు, మరాఠా రవీందర్రావు, ఉపాధ్యక్షులు. పి రెడ్డయ్య, కార్యదర్శులు, జి రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి, రామకృష్ణ, కోశాధికారి, టి చంద్రశేఖర్, సభ్యులు, జి విజయ్ కుమార్, వేణుగోపాలచార్యులు, మరియు వై మోహన్ రావు, లక్ష్మి చౌదరి, వెంకట్రాజ్యం, లక్ష్మణ్, విజయ్ కుమార్ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ మాట్లాడుతూ, కాలనీల అభివృద్ధిలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారానికి చురుకుగా పనిచేయాలని కమిటీ సభ్యులను ప్రోత్సహించారు.సాకేత్ కాలనీలో పారిశుధ్యం, రోడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ నివాసులు, యువకులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.




